సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర వాహనదారుడిపై పడిన ఫ్లెక్సీ.. తీవ్ర గాయాలు

సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర వాహనదారుడిపై పడిన ఫ్లెక్సీ.. తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో పలుచోట్ల శనివారం (జూన్ 10న) రాత్రి భారీ ఈదురుగాలులు వీచాయి. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది. భారీ ఈదురుగాలులకు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఓ వాహనదారుడిపై ఫ్లెక్సీ పడింది. వాహనంపై వెళ్తున్న  వ్యక్తిపై.. అక్కడే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ మీద పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ఉన్నప్పటికీ గాయాలయ్యాయి. వెంటనే మిగతా వాహనదారులు బాధితుడిని పైకి లేపి.. సపర్యలు చేశారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని రూల్ ఉంది. కానీ.. జీహెచ్ఎంసీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పడితే అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్లెక్సీల ఏర్పాట్లపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సీఎం ఆఫీస్ ముందు కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా బల్దియా అధికారులు లైట్ తీసుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.