యష్‌‌‌‌, రజత్‌‌‌‌ సెంచరీలు... దులీప్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ 384/5

యష్‌‌‌‌, రజత్‌‌‌‌ సెంచరీలు... దులీప్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ 384/5

బెంగళూరు: సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌తో జరుగుతున్న దులీప్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. యష్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ (137 బ్యాటింగ్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (101) సెంచరీలతో చెలరేగడంతో.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 104 ఓవర్లలో 384/5 స్కోరు చేసింది. రాథోడ్‌‌‌‌తో పాటు సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌ (47 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. 

ప్రస్తుతం సెంట్రల్‌‌‌‌ 235 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.  50/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన సెంట్రల్‌‌‌‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. నాలుగు ఓవర్ల తేడాలో అక్షయ్‌‌‌‌ వాడ్కర్‌‌‌‌ (22), శుభమ్‌‌‌‌ శర్మ (6) ఔటయ్యారు. ఫలితంగా 74/2 స్కోరుతో కష్టాల్లో పడిన సెంట్రల్‌‌‌‌ను పటీదార్‌‌‌‌, యష్‌‌‌‌ రాథోడ్‌‌‌‌ ఆదుకున్నారు. 

అప్పటికే హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన డానిష్‌‌‌‌ మాలేవర్‌‌‌‌ (53) మరో నాలుగు ఓవర్ల తర్వాత వెనుదిరగడంతో మూడో వికెట్‌‌‌‌కు 19 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో నిలకడగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన రాథోడ్‌‌‌‌ రెండు కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పటీదార్‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌కు 167, సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌కు 118 రన్స్‌‌‌‌ జోడించాడు. మధ్యలో ఉపేంద్ర యాదవ్‌‌‌‌ (5) ఫెయిలయ్యాడు. గుర్జప్నీత్ సింగ్ 3, నిధీశ్‌‌‌‌, కౌశిక్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు.