ఒకే స్టోరీ నేపథ్యంలో రాబోతున్న రెండు సినిమాలు

ఒకే స్టోరీ నేపథ్యంలో రాబోతున్న రెండు సినిమాలు

ఏ సినిమాల్లో అయినా స్టోరీ నేపథ్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మూవీ బ్యాక్ డ్రాప్ సినిమా విజయాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే కథతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు ఒకే నేపథ్యంతో రెండు సినిమాలు రాబోతున్నాయి. అవి కూడా లవ్ స్టోరీతో తెరకెక్కుతున్నాయి. ప్రేమ కథ చిత్రాలతో ఆకట్టుకునే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాలను రూపొందిస్తుండడం విశేషం.

దుల్కర్ సల్మాన్ మరోసారి డైరెక్ట్ గా తెలుగులో చేస్తున్న చిత్రం సీతా రామం. ఈ మూవీని హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. మృనాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ఈ మూవీకి ట్యాగ్‌లైన్. వైజయంతి మూవీస్ బ్యానర్‌ లో రాబోతుండటం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌, ప్రియాంక దత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

అలాగే కాశ్మీర్ నేపథ్యంలో రూపొందుతున్న మరో మూవీ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా కాశ్మీర్ లో షూటింగ్ కూడా చేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సోల్జర్ గా కనిపించనున్నాడట. సినిమాలో సమంత పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు. ‘మజిలీ’ మూవీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

దుల్కర్ సల్మాన్ కు మహానటి సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఆయన ఒక స్టార్‌ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు సీతారామం సినిమాతో తప్పనిసరిగా దుల్కార్ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటున్నారు అభిమానులు. ఒకే నేపథ్యంలో రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరిన్ని వార్తల కోసం..

శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు