విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ..నార్త్ జోన్ డీసీపీ రష్మిపెరుమాళ్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ..నార్త్ జోన్ డీసీపీ రష్మిపెరుమాళ్

పద్మారావునగర్, వెలుగు: విధుల్లో జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నార్త్​జోన్ డీసీసీ సాధన రష్మి పెరుమాళ్ పోలీసు అధికారులను హెచ్చరించారు. సోమవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. 

విజిబుల్ పోలీసింగ్, జవాబుదారీతనం, సమర్థవంతమైన పోలీసింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచాలన్నారు. పౌరుల ఫిర్యాదులకు సత్వర స్పందన కల్పించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల్లో మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మాదకద్రవ్యాల వ్యతిరేక అమలు కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో నార్త్​ జోన్​అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, గోపాలపురం, బేగంపేట, తిరుమలగిరి, డివిజన్ల ఏసీపీలు, నార్త్ జోన్​లోని అన్ని పోలీసు స్టేషన్ల  ఇన్​స్పెక్టర్లు, సబ్ -ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ -ఇన్​స్పెక్టర్లు,హెడ్ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్ లు పాల్గొన్నారు.