సెల్ప్​ హెల్ప్​​ గ్రూపులకు సోలార్ ప్రాజెక్ట్స్​​ అప్పగింత.. గిరిజనులకు సోలార్​ పంపు సెట్లు పంపిణి..

 సెల్ప్​ హెల్ప్​​ గ్రూపులకు సోలార్ ప్రాజెక్ట్స్​​ అప్పగింత.. గిరిజనులకు సోలార్​ పంపు సెట్లు పంపిణి..

కేంద్రమంత్రి ప్లహ్లాద్​ జోషితో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటి అయ్యారు. తెలంగాణలో ప్రవేశ పెట్టు న్యూ ఎనర్జీ పాలసీ గురించి చర్చించారు.  సోలార్​ పవర్​ పై ఫోకస్​ పెట్టామని కేంద్రమంత్రి వివరించారు.  ఇంకా పలు కీలక విషయాలపై చర్చించామన్న భట్టి... తెలంగాణలో సెల్ప్​ హెల్ప్​ గ్రూపులకు సోలార్​ పవర్​ ను అప్పగిస్తామన్నారు.  వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్​ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

విద్యుత్​ విషయంలో కొత్త స్కీం అమలు చేస్తామని .. కుసుం సీ పథకం కింద లక్ష  సోలార్​ పంపు సెట్లను గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు.  కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరామని.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిచారన్నారు.  విద్యుత్​ సంస్కరణల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించిందని  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.