చాక్లెట్​ తింటే  హ్యాపీనెస్​ వస్తదట!

చాక్లెట్​ తింటే  హ్యాపీనెస్​ వస్తదట!

మూడ్‌ బాగోలేదా? స్ట్రెస్​ ఎక్కువయ్యిందా? అయితే ఒక డార్క్‌ చాక్లెట్‌ తినేయండి.. అన్నీ సెట్​ అయిపోతాయ్​ అంటున్నారు కొరియా సైంటిస్టులు. చాక్లెట్ తినమన్నారు కదా!! అని ప్యాకెట్లు తినేయడం కాదు.. దీనికి ఒక లిమిట్​ ఉందంటున్నారు. ఆ ప్రకారం తింటేనే హ్యాపీగా ఉండొచ్చని చెబుతున్నారు. 85 పర్సెంట్‌ కోకో ఉన్న డార్క్​ చాక్లెట్​ను 10 గ్రాముల చొప్పున రోజుకు మూడుసార్లు తిన్న వారిపై కొరియా రీసెర్చర్స్‌ స్టడీ చేశారు. 46 మందిపై రీసెర్చ్‌ జరిపాకే ఈ వివరాలు తెలిపారు. వారిలో 20 రకాలైన మానసిక స్థితిగతులను పరిశీలించారు. డార్క్‌ చాక్లెట్స్‌ తినడం వల్ల వాళ్ల శారీరక, మానసిక ప్రవర్తనలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తించారు. డార్క్​ చాక్లెట్​ను తినడం వల్ల మూడ్​లో వచ్చే మార్పులు, గట్​ మైక్రోబయోటాకు మధ్య ఉన్న సంబంధాలను కూడా పరిశీలించారు.

85 శాతం కోకో ఉన్న డార్క్​ చాక్లెట్​ తిన్నవారిలో నెగెటివ్​ మూడ్​ తగ్గినట్టు గమనించారు. అదే 70 శాతం కోకో ఉన్న చాక్లెట్​ తీసుకున్న వారిలో పెద్దగా మార్పు కనిపించలేదు. 85 శాతం డార్క్​ చాక్లెట్​ ఆంటే ఇందులో 85 శాతం కోకో ఉంటుంది. మిగతా 15 శాతం షుగర్, వెనీలా, ఇంకా ఇతర యాడింగ్స్​ ఉంటాయి. మిల్క్‌ కంటెంట్‌ ఉన్న చాక్లెట్స్‌ మాత్రం అతిగా తినకూడదట, అది కోకో ఎక్కువ శాతం డార్క్‌ చాక్లెట్స్​కే పరిమితం. తక్కువ శాతం చక్కెర, కొవ్వు, పామాయిల్ వంటి ఇతర యాడింగ్స్‌ ఉండి, అధిక కోకో శాతం ఉన్న చాక్లెట్లే మంచివట. చాక్లెట్ ఉత్పత్తిలో ఉపయోగించే కోకోలో ఫైబర్, ఐరన్‌ మెండుగా ఉంటాయి. ‘డార్క్ చాక్లెట్‌లో మానసిక స్థితిని మార్చే గుణాలు ఎన్నో ఉన్నాయని ఎంతో కాలంగాం తెలుస’ని ఫుడ్‌ అండ్ న్యూట్రిషన్‌ రీసెర్చర్స్‌ అంటున్నారు. ఇంకేం.. రోజూ ఒకటో రెండో డార్క్ చాక్లెట్లు ట్రై చేయండి.