ఎకోఫ్రెండ్లీ మేకప్​​ రిమూవర్​

ఎకోఫ్రెండ్లీ మేకప్​​ రిమూవర్​

ఫౌండేషన్​, హెవీ ఐ–షాడో, ఐ–లైనర్​, టింట్, లిప్​స్టిక్​ వంటి మేకప్​ను చర్మం దెబ్బతినకుండా తీసేసేందుకు రోస్​ క్లెన్సింగ్​ ప్యాడ్స్​ పనికొస్తాయి. ఈ ప్యాడ్స్​ కెమికల్​ ఫ్రీ. ఈ కాటన్​ ప్యాడ్స్​ను ఒకసారి వాడి పడేయాల్సిన అవసరం లేదు. ఉతుక్కుని మళ్లీ వాడొచ్చు. వీటిని దాదాపు 200 సార్లు ఉతికి వాడొచ్చు. అలాగే ఒక్కో ప్యాడ్​... 500 కాస్మొటిక్​ వైప్స్​కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఒక ప్యాక్​లో రెండు ప్యాడ్స్​ వస్తాయి. డ్రై, సెన్సిటివ్... ఇలా ఏ​ స్కిన్ టైప్​ అయినా పనికొస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ మేకప్​ రిమూవర్. కాటన్​తో తయారైన ఈ రిమూవర్​ ప్యాడ్​, వైప్స్​ రెండు రకాలుగా దొరుకుతాయి. పూర్తి కెమికల్​ ఫ్రీ ప్రొడక్ట్​ ఇది.
మేకప్​ రిమూవ్​ ప్యాడ్స్​ వాడేముందు వాటిని గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టాలి. ఆ తరువాత ప్యాడ్​ను చర్మం మీద నెమ్మదిగా, గుండ్రంగా తిప్పుతూ మేకప్​ తీసేయాలి. ఆ తరువాత క్లెన్సింగ్​తో తుడవాలి. వాడిన ప్రతిసారి ఈ ప్యాడ్స్​​ను సబ్బు, నీళ్లతో శుభ్రం చేయాలి. అలాగే బాగా శుభ్రం చేసేందుకు వారానికి ఒకసారి వాషింగ్​ మెషిన్​లో బట్టలు ఉతికేటప్పుడు వీటిని కూడా వేసి ఉతకాలి.

ధర:175 రూపాయలు