హైదరాబాద్, వెలుగు: ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరుల పెంపుపై లోత్తైన చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ తదితర అంశా లపై చర్చించారు.
విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూ నా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచ నాతో పాటు ఇతర అంశాలను వారు సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరవింద్ సుబ్రమణియన్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సీఎంకు సూచించారు.
