అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సోమవారం (నవంబర్ 24) గూడెం మహిపాల్, మధు సూధన్ రెడ్డి సోదరుల కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది ED. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కు చెందిన 80 కోట్ల రూపాయల ఆస్తుల అటాచ్ చేసింది.
గతంలో ఈ కంపెనీలకు చెందిన 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ.. లేటెస్టుగా 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. సబ్ కాంట్రాక్ట్ లకు అనుమతి లేకున్నా GVR కు సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అనుమతి లేని చోటా అక్రమంగా మైనింగ్ చేయడంపై దర్యాప్తు చేపట్టింది.
అనుమతి ఉన్న చోటా మోతాదుకు మించి మైనింగ్ చేసి.. కోట్ల రూపాయలతో ఆస్తులు కొన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. వాటిని బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు గుర్తించి ఆ ఆస్తులను అటాచ్ చేసింది.
