లోన్ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో రూ.72.32 కోట్లు అటాచ్‌‌‌‌‌‌‌‌

లోన్ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో రూ.72.32 కోట్లు అటాచ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లోన్ యాప్స్‌‌‌‌‌‌‌‌ కేసులో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీకి చెందిన రూ.72.32 కోట్లను బుధవారం అటాచ్‌‌‌‌‌‌‌‌ చేసింది. చైనా, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేసిన లోన్ యాప్స్‌‌‌‌‌‌‌‌ వివరాలను మీడియాకు వెల్లడించింది. క్యుడోస్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ.. 39 ఆటోమెటిక్ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీలతో ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌ ఎంవోయూలు కుదుర్చుకుని ఆర్బీఐ, ఎన్బీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ రూల్స్‌‌‌‌‌‌‌‌కి విరుద్ధంగా రూ.2,224 కోట్ల మనీ సర్క్యులేట్  చేసింది. 

చైనా, హాంకాగ్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌, కాల్‌‌‌‌‌‌‌‌సెంటర్స్‌‌‌‌‌‌‌‌తో మొత్తం రూ.544 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ పొందింది. ఇందులో రూ.24 కోట్లు కమీషన్‌‌‌‌‌‌‌‌ క్యుడోస్ ఫైనాన్స్​ ఓనర్లకు అందింది. కంపెనీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, సీఈవో పవిత్ర ప్రదీప్‌‌‌‌‌‌‌‌ వల్వేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కిందటి నెల 17 ఈడీ అరెస్ట్ చేసింది. పేమెంట్ గేట్‌‌‌‌‌‌‌‌వే అకౌంట్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా చైనాకు మనీ ల్యాండరింగ్‌‌‌‌‌‌‌‌ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. పర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీస్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఇండియాలో చైనా, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ కంపనీలు మర్చెంట్‌‌‌‌‌‌‌‌ ఐడీ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు గుర్తించింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్లకు పేటీఎమ్‌‌‌‌‌‌‌‌, రోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే వినియోగించుకున్నట్లు ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది.