జేసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని రెండోరోజూ విచారించిన ఈడీ

జేసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని రెండోరోజూ విచారించిన ఈడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రెండో రోజైన శనివారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌లోని ఈడీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కి వచ్చారు. అధికారులకు డాక్యుమెంట్స్, బ్యాంక్​స్టేట్​మెంట్స్​ అందజేశారు. జేసీ అందించిన పత్రాల ఆధారంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల దాకా ఈడీ అధికారులు ప్రశ్నించారు. బీఎస్‌‌‌‌‌‌‌‌-3 వెహికల్స్​ను బీఎస్​4గా మార్చి రిజిస్ట్రేషన్స్ చేశారన్న కేసులో  జేసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై ఏపీలో కేసులు నమోదయ్యాయి.

తాడిపత్రి, అనంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రెండు రోజులుగా విచారిస్తున్నది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, ఛత్తీస్​గడ్​లలో రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్, ఆర్టీఏ అందించిన వివరాలతో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే స్క్రాప్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్​ కొనుగోలు చేసిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించారు. హవాలా రూపంలో డబ్బులు చెల్లించారా.. అనే కోణంలో జేసీని ప్రశ్నించినట్లు తెలిసింది.