హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. బుధవారం (మే 27) కరీంనగర్, హైదరాబాద్‌లోని పలువురు ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలలో ఈ తెడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 8 చోట్ల నాలుగు కంపెనీలలో సోదాలు చేపట్టారు అధికారులు. జీఎస్టీ ఎగ్గొట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
