
బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు,బంధువుల ఇళ్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం మూడు చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి బంధువులకు రియల్ ఎస్టేట్స్, మైనింగ్ ఇంకా ఎన్నో బిజినెస్ లు ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.