ప్రపంచాన్ని మార్చే శక్తి  ఒక్క విద్యకే ఉంది

ప్రపంచాన్ని మార్చే శక్తి  ఒక్క విద్యకే ఉంది

ప్రపంచాన్ని మార్చే శక్తి  ఒక్క విద్యకే ఉందన్నారు ఏపీ సీఎం జగన్. అయితే ప్రపంచంతో పోటీపడే పరిస్థితి  పేద పిల్లలకు రావాలన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే విప్లవాత్మక మార్పులు చేపట్టామన్నారు. విద్యార్థుల కోసం జగనన్న విద్యాకానుక పథకాన్ని కృష్ణా జిల్లా పునాదిపాడులో ప్రారంభించారు సీఎం జగన్. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక స్కూల్  కిట్లు ఇవ్వనున్నారు. ఫస్ట్ టూ టెన్త్ అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందించనున్నారు. ఈ పథకంతో  పేదవాడి తలరాతలు మార్చాలని 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

దాదాపు 650 కోట్ల రూపాయ ఖర్చుతో స్కూల్  కిట్లు పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్ లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్  కిట్ తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్  పుస్తకాలు,యూనిఫారాలు, షూస్, సాక్సులు, బెల్టులు, బ్యాగులు  అందిస్తున్నట్లు తెలిపారు జగన్.

విద్యార్థులకు స్టేజీపైనే స్కూల్ కిట్లు పంపిణీ చేశారు జగన్. తాము అమలు చేస్తున్న పథకాలతో పేద ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.