- మంత్రి దామోదర వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీ సవరణ చట్ట బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. అమిటీ వర్సిటీ, సెంట్మేరీ రిహాబిలిటిషన్ వర్సి టీలకు అనుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. రిహా బిలిటిషన్ వర్సిటీ సౌత్ ఇండియాలో లేదని, దీన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలి పారు.
బీజేపీ ఎమ్మెల్యే పాల్వయి హరీశ్ బాబు మాట్లాడుతూ.. ప్రైవేటు వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రైవేటు వర్సిటీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ప్రైవేటు వర్సిటీలతో లాభం ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
