ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. ఏదో సాధిద్దామనుకుంటారు.. కాని ఏమీ చేయలేరు. ఎన్ని తెలివితేటలున్నా.. జీవితంలో మాత్రం సక్సెస్ సాధించలేక అష్ట కష్టాలు పడుతుంటారు. ఇక విద్యార్థులైతే క్లాసులో అందరి కన్నా ముందంజలో ఉన్నా పరీక్షల్లో మాత్రం ఫెయిల్ అవుతుంటారు. ఇలా విద్య.. ఉద్యోగంలో ఇబ్బంది పడే గురు పౌర్ణమి రోజున ( జులై 29) కొన్ని పరిహారాలు పాటిస్తే లైఫ్ లో సక్సెస్ సాధిస్తారని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కోటి విద్యలు కూటి కొరకే.. ఎంత చదివినా.. ఎన్ని తెలివితేటలున్నా.. కెరీర్ మాత్రం కత్తి మీద సాము లాంటిది. పూర్వీలకు శాపం ఉన్నా..గత జన్మల్లో గురువుల శాపం ఉన్నా జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడం చాలా కష్టమని పండితులు చెబుతున్నారు. అలాంటి వారు కెరీర్‌లో అనుకున్న స్థానాన్ని పొందలేరు. తెలిసో.. తెలియకో చేసిన తప్పులు వెంటాడుతుంటాయి.
గత జన్మల్లో కాని.. ఇప్పుడు కాని గురువను అవమాన పరిస్తే సక్సెస్ సాధించడంలో అనేక ఇబ్బందులు ఇస్తాయని పద్మ పురాణంలో పండితులు పేర్కొన్నారు. అలాంటి వారు గురు పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో సక్సెస్ సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
- సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది. ఆ రోజున ( జులై 29) గురువును.. తండ్రిని పూజించాలి. ఇలా చేయడం దో షాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. గురువు అందుబాటులో లేకపోతే... దేవాలయంలో పూజారిని గురువుగా భావించి వారికైనా ఇవ్వాలి. ఇలా చేయడం వలన పితృ దోషం, గురు గ్రహం చెడు ఫలితాలు తొలగిపోతాయి. జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి.
- గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
- మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురు పూర్ణిమ నాడు అవసరమైన వారికి శనగ పప్పును దానం చేయండి.
- పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
- చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. గురు పూర్ణిమ రోజున గురువును పూజించి...ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వారికి పసుపు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
- గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
- సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
- పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.
- పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం
దుస్తులు: పసుపు రంగు దుస్తులను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. ఇది నిజానికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఇలా చేయడం గురు గ్రహానికి సంతోషం కలుగుతుంది. గురువు విద్య..ఙ్ఞానం కలుగచేస్తాడు. ఇలా పసుపు రంగు వస్త్రాలను గురువుకు దానం చేస్తే కెరీర్‌లో సక్సెస్‌ను కూడా పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
స్వీట్స్ : పసుపు రంగులో ఉండే స్వీట్లను గురువుకు ఆరోజు ( జులై 29) ఇవ్వడం మంచిది. అలా చేయడం వలన గురు గ్రహం అనుకూలంగా ఉంటుంది. పితృ దోషాల నుండి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.
పసుపు: గురువుకు పసుపును ఇచ్చి పాదాభివందనం చేయాలి. పసుపు స్వచ్ఛతకు చిహ్నం. పసుపును గురువుకు ఇవ్వడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది.
పండ్లు: పసుపు రంగు పండ్లను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి వాటిని గురువుకు ఇవ్వడం వలన గురు గ్రహ అనుగ్రహం లభిస్తుంది. తెలివి తేటలు పెరుగుతాయి... అదృష్టం కూడా వస్తుంది. అందుకే పెద్దలకు తాంబూలం ఇచ్చే సమయంలో తమలపాకులు అరటిపండ్లు ఇస్తారు.
పూలు: పసుపు రంగులో ఉండే సంపంగి పూలు, చామంతి పూలు వంటి పూలను గురువుకు ఇవ్వండి. మెదడు ప్రశాంతంగా మారుతుంది, గురు గ్రహం అనుగ్రహం పొందుతారు.
గురు పౌర్ణమి నాడు ఈ పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు. పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. గురు గ్రహం నుండి శుభ ఫలితాలను పొందవచ్చు, జీవితం సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
