అందుబాటులోకి విద్యాశాఖ టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌

అందుబాటులోకి విద్యాశాఖ టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌

‘వెలుగు’ ఎఫెక్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: ‘విద్యా శాఖ టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌ ఔటాఫ్‌‌ ఆర్డర్‌‌’ శీర్షికతో ఈనెల 14న ‘వెలుగు’లో ప్రచురితమైన కథనానికి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం నుంచి 1800-425-7462 నంబర్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌ నిర్వహణ ఉద్యోగులను వేరే విభాగాల్లోకి మార్చడంతో 10 నెలలుగా హెల్ప్​లైన్ పనిచేయలేదు. దీంతో టీచర్లు, పేరెంట్స్‌‌, విద్యార్థులు సమస్యలు చెప్పుకోవడానికి, వారి పనుల స్టేటస్‌‌ తెలుసుకునేందుకు హైదరాబాద్‌‌ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ‘వెలుగు’లోకి తీసుకురాగా, స్పందించిన ఉన్నతాధికారులు టోల్‌‌ఫ్రీ నంబర్‌‌ను అందుబాటులోకి తెచ్చారు. మెడికల్‌‌ బిల్స్‌‌ స్టేటస్‌‌, ట్రాన్స్‌‌ఫర్స్‌‌, పెన్షన్ వివరాలను హెల్ప్‌‌లైన్‌‌కు ఫోన్‌‌ చేసి తెలుసుకోవచ్చని, ఫిర్యాదులు చేయవచ్చని విద్యాశాఖాధికారులు చెప్పారు.