మార్చి 14 వ‌ర‌కు స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు

మార్చి 14 వ‌ర‌కు స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా కేసులను తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు మహా ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా పుణెలో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మార్చి 14 వరకు విద్యాసంస్థలు ఓపెన్ చేయవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారని.. అత్యవసరాలకు తప్ప రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని పుణె మేయర్ మురళీదర్ మోహోల్ తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 28 వరకు ప్రకటించిన నిబంధనలను మరికొద్ది రోజులు పొడిగించబోతున్నట్లు తెలిపారు.

పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు. స్కూళ్లకు వచ్చే ముందు విద్యార్థులు, టీచర్లు విధిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.అయతే కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో మూసేశారు. కరోనా కేసులు పెరుగుతూ వెళితే మరోసారి కఠిన నిబంధనలను అమలు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు.