కొట్లాడుతేనే హక్కులు వస్తాయి: ఈటల రాజేందర్

కొట్లాడుతేనే హక్కులు వస్తాయి: ఈటల రాజేందర్

బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లో నాలుగోవ జాతీయ ఓబీసీ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..  బీసీల సమస్యలపై మాట్లాడారు. బీసీలు ఎప్పుడూ… ఏవోవో మీటింగ్ లు పెట్టుకుంటరని చాలా మంది మాట్లాడుతుంటరు… అయితే భంగ పడ్డ వాళ్లకు ,అన్యాయం జరిగిన వాళ్లకు సంఘాలు ఉంటాయని, వారు తమ సమస్యలపై పోరాటం కోసమే సమావేశాలు జరుపుతారని ఆయన అన్నారు. బీసీలకు కావాల్సింది తాయిలాలూ, బిక్షం కాదని,  రాజ్యాధికారం, హక్కులు కావాలని అన్నారు. ఐక్యంగా పోరాడుతేనె సమస్యలు పరిష్కారం అవుతాయని, కొట్లాడుతేనే హక్కులు వస్తాయని ఆయన అన్నారు. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు

బీసీ లకు 27% రిజర్వేషన్లు ఉంటే 6% నుంచి 11% వరకే అమలు అవుతున్నాయన్న ఈటెల.. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏండ్లు అవుతున్నా బీసీ లు ఇంకా ఆక్రోశిస్తూనే ఉన్నారన్నారు. ఓపన్ కాంపిటీషన్ లో బిసి లు సీట్లు కోల్పోతున్నారని, దీనిపైన పాలకులు ఆలోచించాలన్నారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం తమ సహకారం ఉంటుందన్నారు మంత్రి ఈటెల. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్,పలువురు బీసీ ఎమ్మెల్యే లు, తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.