అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదిరే అవకాశం ఉన్న ఒక కొత్త ఒప్పందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రూత్ సోషల్'లో ఆయన ఇరాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.
ఇరాన్ దేశంలో యురేనియం సుసంపన్నం చేయడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ అణు కార్యక్రమాన్ని పక్కన పెడితే, ఆ దేశంపై ఉన్న భారీ సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించడంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ ఆర్థికంగా పుంజుకోవడానికి అమెరికా సహకరిస్తుందని, దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మొత్తం 15 అంశాల్లో చాలా వరకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.
►ALSO READ | అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఇంతకీ ఏమన్నాదంటే..?
ఇరాన్ లోని అణు కేంద్రాలను అమెరికా ఉపగ్రహాల ద్వారా గమనిస్తోందని, అక్కడ చిన్న వస్తువు కదిలినా తమకు తెలుస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
చాలా కాలంగా అమెరికాకు, ఇరాన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పుడు ట్రంప్ ఆఫర్ ఇస్తున్నారు. మీరు అణు బాంబుల ప్రయత్నాలు ఆపేయండి.. ఆలా చేస్తే మీ దేశంపై ఉన్న ఆంక్షలు తీసేసి, మేము మీకు ఆర్థికంగా సహాయం చేస్తాం అని అన్నారు.
