హైదరాబాద్ జలవిహార్ లో ఆర్వో ప్లాంట్ పేలుడు... ఇద్దరికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్ జలవిహార్ లో ఆర్వో ప్లాంట్ పేలుడు... ఇద్దరికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్ జలవిహార్ లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో భయాందోళనకు గురయ్యారు సందర్శకులు. బుధవారం ( ఏప్రిల్ 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్ కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ ఘటనలో ప్లాంట్ దగ్గర పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

పేలుడు ధాటికి ఆర్వో ప్లాంట్ పరికరాలన్నీ తునాతునకలు అయ్యాయి. ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్ లో అధిక ప్రెషర్ ఏర్పడడమే పేలుడుకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

►ALSO READ | ఉత్తమ్ పై పుకార్లు, వెంకట్ రెడ్డిపై నిందలు, భట్టిపై తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి 

సమ్మర్ కావడంతో జలవిహార్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది... ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం పట్ల సందర్శకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.