ఉత్తమ్ పై పుకార్లు, వెంకట్ రెడ్డిపై నిందలు, భట్టిపై తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి 

ఉత్తమ్ పై పుకార్లు, వెంకట్ రెడ్డిపై నిందలు, భట్టిపై తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి 

ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సింగరేణిలో అవకతవకలని ఉప ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. సన్న బియ్యం పట్ల ప్రజల్లో వచ్చిన ఆదరణ జీర్ణించుకోలేక పౌర సరఫరాలో అవినీతి అంటూ మంత్రి ఉత్తమ్ పై మరో పుకారు పుట్టించారని అన్నారు. 

లిక్కర్ బాటిల్స్ కి వేసే స్టిక్కర్ల విషయంలో, టెండర్ల విషయంలో అవకతవకలు అంటూ లిక్కర్ విషయంలో ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి మీద కూడా అదే రకంగా నిందలు వేశారని మండిపడ్డారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో చేపట్టే హ్యామ్ సిస్టంలో రోడ్ల నిర్మాణం చేపడితే... బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం వస్తుందని.. మంత్రి కోమటిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని.. క్రషర్లు అంటూ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు పొంగులేటి. 

ఇలా ప్రతి మంత్రి మీద తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.బీఆర్ఎస్ నేతల మీద ఉన్న బురదను ప్రభుత్వం మీద చల్లితే..వారు శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని నిజాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి పొంగులేటి.