
మేడిపల్లి, వెలుగు: ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్యాదవ్అన్నారు. సోమవారం ఒకటో డివిజన్ రాజేశ్నగర్ కాలనీలో ఓపెన్ జిమ్‌ను మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం శివదుర్గ కాలనీలలో రూ.40 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనతికాలంలోనే ఒకటో డివిజన్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, నాయకులు రంగ బ్రహ్మన్న, కొత్త గోపాల్ గౌడ్, కుర్రి శివశంకర్ పాల్గొన్నారు.