
జూబ్లీహిల్స్, వెలుగు: జాబ్మేళా నిర్వాహకులు.. ఫుడ్ సప్లయ్ చేసే వెహికల్కు కేటీఆర్ ఫొటో ఉండడంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. యూసఫ్ గూడాలోని మహమూద్ ఫంక్షన్ హాల్ లో గురువారం డెక్కన్ బ్లాస్టర్ అనే సంస్థ జాబ్ మేళా నిర్వహించింది. అందులో పాల్గొన్న యువతీ యువకులకు ఫుడ్ సప్లై చేస్తున్న వాహనంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరి బీఆర్ ఎస్ నాయకుల ఫొటోలు ఉన్నాయి.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో విషయం అధికారులకు తెలిసింది. డిప్యూటీ తహసీల్దార్, జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వెళ్లి ఫుడ్ ను సీజ్ చేసి, నిర్వాహకులైన మన్నన్ ఉల్లా ఖాన్, విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు.