రాష్ట్రంలో 119 సెగ్మెంట్లలో 4వేల 355 నామినేషన్లు

రాష్ట్రంలో 119 సెగ్మెంట్లలో 4వేల 355 నామినేషన్లు
  • నిన్న ఒక్క రోజే 2,327 దాఖలు
  •  గజ్వేల్ లో అత్యధికంగా 68, మేడ్చల్ లో 66
  • కామారెడ్డిలో 30 నామినేషన్లు దాఖలు
  • సిరిసిల్లలో 17, సిద్దిపేటలో 27 మంది నామినేషన్

హైదరాబాద్: రాష్ట్రంలోని 119 సెగ్మెంట్లకు 4,355 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నిన్న ఒక్క రోజే 2,327 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి రెండేసి సెట్లు వేశారు. గజ్వేల్ లో అత్యధికంగా 68 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ నిలిచింది. ఇక్కడి నుంచి 66 మంది బరిలో నిలిచారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 30 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ స్థానం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్న విషయం తెలిసిందే. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో 17, మంత్రి హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్దిపేటలో 27, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో 11, బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజూరాబాద్ లో 21, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తున్న హుస్నాబాద్ లో 28 మంది నామినేషన్లు వేశారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ తోపాటు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.