గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీ, తెలంగాణలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో రెండు, తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29, 2021న ముగియనుంది. ఏపీలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాము సూర్యా రావు మరియు కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎ.ఎస్. రామకృష్ణ స్థానాలు ఖాళీ కానున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి.

ఈ నాలుగు స్థానాలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు ఫిబ్రవరి 23ను ఆఖరు తేదీగా ప్రకటించారు. ఫిబ్రవరి 24న అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 26గా తెలిపారు. ఈ నాలుగు స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. అనంతరం మార్చి 17న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా.. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

For More News..

కేసీఆర్‌కు బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకున్నా

ఎంఐఎం మద్దతుతో జీహెచ్ఎంసీ మేయర్‌ దక్కించుకున్న టీఆర్ఎస్

కౌన్సిల్ నుంచి వెళ్లిపోయిన టీఆర్ఎస్ లేడీ కార్పొరేటర్