పోలింగ్ బూత్‌ని ఫంక్షన్ హాల్‌లా డెకరేషన్

పోలింగ్ బూత్‌ని ఫంక్షన్ హాల్‌లా డెకరేషన్

వేములవాడ: ఓటర్లను ఆకర్షించడానికి వినూత్నపద్దతిని చేపట్టారు  ఎన్నికల అధికారులు. వేములవాడ కొయినాపల్లి 13 వార్డ్  పోలింగ్ బూత్ లో ఓటేయడానికి వస్తున్న ఓటర్లకు బొట్టు పెట్టి, పూలు వెదజల్లి ఆహ్వానిస్తున్నారు అధికారులు. ఇందుకుగాను… ఓటింగ్ సెంటర్ ను బెలున్లతో అచ్చం ఫంక్షన్ హాల్ లాగ అలంకరించారు. ఎన్నికల అధికారులు చేసిన ఏర్పాట్లకు ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత స్వీట్స్ ఇస్తున్నారు. దీంతో పోలిగ్ స్టేషన్ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. పొద్దున ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదుగంటలవరకు కొనసాగుతుంది.