ఓట్ల కోసం నోట్లు విసిరారు : వైసీపీ నేతలపై కేసు

ఓట్ల కోసం నోట్లు విసిరారు : వైసీపీ నేతలపై కేసు

కర్నూలు: ఎన్నికల కోడ్ ను ఉల్లంగించారని వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. దీంతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో గురువారం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరఫున శిరివెళ్లలో ప్రచారం చేస్తున్న కొందరు నేతలు ప్రజలపై డబ్బులు వెదజల్లారు. దీంతో నోట్లు ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎన్నికల ప్రచారంలో కొందరు వైసీనీ కార్యకర్తలు డబ్బులు వెదజల్లడం.. ఎలక్షన్స్ కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీకి  చెందిన అన్వర్‌ బాషా, సలీం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఓట్ల కోసం నోట్లు పంచడం నేరం కిందికే వస్తుందని తెలిపారు పోలీసులు.