
హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సులు వాడడంలో దేశంలోనే TSRTC మొదటి స్థానంలో ఉందన్నారు ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ. మియాపూర్ బస్ డిపో-2లో మంగళవారం 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీల్‌శర్మ .. ఈ బస్సులను ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ కు నడుపుతున్నట్లు తెలిపారు. నాలుగు రూట్స్ లో ప్రతి అరగంటకు ఈ విద్యుత్ బస్సుల సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ బస్సులతో సిటీలో పొల్యూషన్ తక్కవ అని.. డీజిల్ ధరలు పెరిగినా బస్ ఛార్జీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు బస్సులకు సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బస్సు రూట్స్ ఇవే..
-మియాపూర్ JNTU, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, సైబర్ టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మీదుగా వేవ్ రాక్ పార్కుకు 195W నంబరుతో 4 బస్సులు నడపనున్నారు.
-300/126 నంబరుతో మియాపూర్, JNTU, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ, షేక్ పేట, మెహిదీపట్నం, PVనరసింహారావు రూట్ లో ఉప్పల్ రింగు రోడ్డు వరకూ నడపనున్నారు.