విజయవాడకు 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ బస్సు

విజయవాడకు 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ బస్సు

టీఎస్​ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడతగా హైదరాబాద్ - విజయవాడ రూట్​లో 50 బస్సులను 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడపాలని సంస్థ నిర్ణయించింది.     ఇయ్యాల ‘ఈ గరుడ’ బస్సుల ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఆర్టీసీ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడతగా హైదరాబాద్ – విజయవాడ రూట్​లో 50 బస్సులను 20 నిమిషాలకు ఒకటి చొప్పున నడపాలని సంస్థ నిర్ణయించింది. ‘ఈ–గరుడ’ పేరుతో పిలిచే ఈ బస్సులను  ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్  మియాపూర్​లో మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఒక  ప్రకటనలో తెలిపింది. మొదట 10 బస్సులను ప్రారంభించి, తర్వాత దశలవారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. ఈ బస్సుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే  325 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. వచ్చే రెండేళ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ పేర్కొంది. వాటిలో 1,300 బస్సులను హైదరాబాద్​లో, 550 బస్సులను దూర ప్రాంతాలకు నడుపనున్నారు. 10 డబుల్ డెక్కర్ బస్సులను  హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. 

ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీ బస్సు ప్రత్యేకతలు

  •     12 మీటర్ల పొడవుండే ‘ఈ– గరుడ’ బస్సులో 41 సీట్లుంటాయి. 
  •     ప్రతి సీటు వద్ద ఫోన్ ​చార్జింగ్, రీడిండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్యానిక్​ బటన్​,  వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టం ఉంటాయి.
  •     మూడు సీసీ కెమెరాలు ఉంటాయి. ఆటోమెటిక్ ప్యాసింజర్  కౌంటర్ (ఏపీసీ) కెమెరా, రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమెరా కూడా అమర్చారు. 
  •     బస్సు ముందు, వెనకాల ఎల్ఈడీ బోర్డులు, అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించే  ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టం (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉంటాయి.