వచ్చే నెల నుంచి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు

వచ్చే నెల నుంచి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్, వెలుగు : వచ్చే నెలలో ఎలక్ట్రిక్ బస్సులను లాంచ్​ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. తొలి దశలో హైదరాబాద్–విజయవాడ రూట్ లో 50 బస్సులను తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం బస్ భవన్ లో ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ ఎండీ సజ్జనార్, సీవోవో రవీందర్, జాయింట్ ఎండీ సంగ్రామ్ జీ పాటిల్, ఈడీలు పరిశీలించారు. బస్సులో ప్యాసింజర్లకు కల్పించే ఫెసిలిటీస్​పై బస్సుల తయారీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)  ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేస్తూ, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పొల్యూషన్ ఫ్రీ అయిన ఈ బస్సులకు పబ్లిక్ నుంచి మంచి ఆదరణ ఉంటుందని సజ్జనార్ తెలిపారు.  ఓజీఎల్ కంపెనీకి 550 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌‌ సిటీలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి  మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.