ఈబైక్ గో నుంచి ఏసర్ ఈవీలు

ఈబైక్ గో నుంచి ఏసర్ ఈవీలు

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌‌‌‌ఫారమ్ ఈబైక్​గో, టెక్ కంపెనీ ఏసర్‌‌‌‌తో చేతులు కలిపింది. ఏసర్ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌‌‌‌లను హైదరాబాద్ మార్కెట్‌‌‌‌లోకి తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నగరంలో పలు ఔట్​లెట్లను ఏర్పాటు చేస్తోంది. మొదటి ఔట్​లెట్​ను నాగోల్​లో మొదలుపెట్టింది. ఏసర్​ ప్రొడక్టుల్లో ఈ–బైసికిల్స్​, స్కూటర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈబైక్​గో సీఓఓ హరికిరణ్​ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 నగరాల్లో ఏసర్​వెహికల్స్​ను అమ్ముతున్నామని చెప్పారు. వీటిని భారతీయ రోడ్లు, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించారని తెలిపారు.