
హైదరాబాద్: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు. కాగా, మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఫిర్యాదులు అందటంతో మంగళవారం (సెప్టెంబర్ 16) ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
కొండాపూర్లోని మ్యాగ్నా లేక్వ్యూ అపార్ట్ మెంట్లో ఏడీఈనివాసం, నానక్ రాంగూడలోని అంబేద్కర్ పర్సనల్ఆఫీస్తో పాటు అతని బంధువుల ఇండ్లల్లోనూ సోదాలు చేశారు. అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. సోదాల్లో ఏసీబీ అధికారులు భారీ అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.300 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు, 10 ఎకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో అధునాతనమైన భవనం, సిటీలో 6 ఇంటి స్థలాలు, హైదరాబాద్ శివారులో ఒక ఫామ్‌హౌస్ గుర్తించినట్లు తెలుస్తోంది.