విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు

విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు

విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా

విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి.. నిరసన తెలిపారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో వినియోగదారులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే.. పూర్తిగా విధులను బహిష్కరించి.. నిరవధికంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న బిల్లుతో చాలా సమస్యలు వస్తాయని, అసలు విద్యుత్‌ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.