
రూ.800 కోట్లు అక్రమంగా వసూలు
హైదరాబాద్: రైసు మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మిల్లర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు దాటినందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. 1.59 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మింది. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్నబియ్యం కొనడం ఎందుకు? అని ప్రశ్నించారు.