
పహల్గాం బాధితులకు అండగా ఉండేందుకు చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నర్వహించనున్నారు. అందుకు సంబంధించిన జెర్సీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పై సీవీ ఆనంద్ కీలక వాఖ్యలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చూసైనా HCA తీరు మార్చుకోవాలని అన్నారు.
తెలంగాణ జిల్లాల్లో ఎంతో మంది ప్రతిభగల క్రికెటర్లు ఉన్నా HCA లీగ్ లు పెట్టడం లేదని అన్నారు. పహల్గాం దాడి తరువాత చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అండగా ఉండేలా ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 9,10 తేదీల్లో ఉప్పల్ స్టేడియం లో ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఎలైట్ క్రికెట్ లీగ్ లో పొలిటికల్, సినిమా, టీవీ, బిజినెస్ జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు. టాలీవుడ్ తరుఫున హీరోలు తరుణ్, సుధీర్ బాబు జెర్సీ లాంచ్ చేశారు.