భూ మండలంపై ధనవంతుడిగా ఎలన్ మస్క్ : చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ IPO

భూ మండలంపై ధనవంతుడిగా ఎలన్ మస్క్ : చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ IPO

ఎలన్ మస్క్.. భూ మండలంపైనే ఫస్ట్ ట్రిలియనీర్ గా అవతరించాడు. లక్ష కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఎలన్ మస్క్. ఇప్పుడు భూ మండలంపైనే ధనవంతుడు ఎలన్ మస్క్ అయ్యాడు. 2026, జూన్ 12వ తేదీన ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. ఈ ఐపీవో సైతం అంచనాలను మించి సక్సెస్ అయ్యింది. 

ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీవో ద్వారా స్పేస్ ఎక్స్ 75 బిలియన్ డాలర్లు సమీకరించింది.
స్పేస్ ఎక్స్ ఒక్కో షేరును 135 డాలర్లుగా ధర నిర్ణయించింది. 
మొత్తం 555.6 మిలియన్ షేర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.
దీని ద్వారా 75 బిలియన్ డాలర్లను సమీకరించింది స్పేస్ ఎక్స్ కంపెనీ. 

స్పేస్ ఎక్స్ షేర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నాలుగు రెట్లు డిమాండ్ ఎక్కువ వచ్చింది. 
ఐపీవో తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులకు ఇచ్చిన స్టా్క్స్, ఇతర వాటా యూనిట్లను పరిగణలోకి తీసుకుంటే దాని విలువ 1.80 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. 

అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే స్పేస్ ఎక్స్ ఐపీవో రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే టాప్ 10 పబ్లిక్ కంపెనీల సరసన నిలిచింది. 
రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ బ్రాడ్ బ్రాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష పరిశోధనలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తుంది. ఎలన్ మస్క్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మరింత విశ్వాసంగా ఉండటం కలిసొచ్చింది. 

స్పేస్ ఎక్స్ ఐపీవోకు వచ్చిన స్పందన చూసిన తర్వాత.. రాబోయే ఏపెన్ AI, ఆంథ్రోపిక్ ఐపీవోలపై భారీ అంచనాలు పెరిగాయి. ఆ రెండు కంపెనీలు సైతం ట్రిలియన్ డాలర్ల విలువను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.