మే 4 నుంచి ఎంసెట్

మే 4 నుంచి ఎంసెట్

ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు
షెడ్యూల్​ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్

హైదరాబాద్​, వెలుగు: ఇంజనీరింగ్​, అగ్రికల్చర్​ అండ్​ మెడికల్​ కోర్సల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంసెట్​ మే 4 నుంచి 11 వరకు జరగనుంది. శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్​ పాపిరెడ్డి ఎంసెట్​ షెడ్యూల్​ను విడుదల చేశారు. అంతకుముందు జేఎన్టీయూ హెచ్​లో టీఎస్​ ఎంసెట్​-2020 కమిటీ సమావేశమైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్​ పాపిరెడ్డి, వైస్​చైర్మన్​ వెంకటరమణ, జేఎన్టీయూ ఇన్​చార్జ్​ వీసీ జయేశ్​ రంజన్​, ఎంసెట్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ గోవర్ధన్​తో పాటు కమిటీ సభ్యులు మీటింగ్​కు హాజరయ్యారు.

నిమిషం రూల్​ ఉంటుంది

ఎంసెట్​ నోటిఫికేషన్​ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. 21 నుంచి మార్చి 30 వరకు నిర్ణీత ఫీజుతో ఆన్​లైన్​లో అప్లికేషన్లను తీసుకుంటారు. ఫైన్​తో ఏప్రిల్​ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్​ 20 నుంచి మే 1 వరకు హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. 20 జోన్ల పరిధిలోని 55 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఏపీ పరిధిలోని కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి జోన్లలోనూ సెంటర్లు పెట్టారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముండడంతో, దీన్ని ఐదు జోన్లుగా విభజించి 23 ప్రాంతాల్లో ఎగ్జామ్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి దివ్యాంగులకు ఫీజులో రాయితీ కల్పించారు. ఇంజనీరింగ్​ స్ర్టీమ్​కు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​ స్టూడెంట్లకు రూ.400, ఇతర విద్యార్థులకు రూ.800గా ఫీజు నిర్ణయించారు. అగ్రికల్చర్​ అండ్​ మెడిసిన్​కూ ఇదే ఫీజు ఉంటుంది. ఇక, ఈసారి కూడా నిమిషం లేట్​ అయినా పరీక్షకు అనుమతించొద్దని అధికారులు నిర్ణయించారు.

దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్​ ఆప్షన్​

ఎంసెట్​ అప్లికేషన్లలో ఈడబ్ల్యూఎస్​ కోటా ఆప్షన్​ పెడుతున్నట్టు కన్వీనర్​ గోవర్ధన్​ తెలిపారు. దానికి ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్​ కోటాను అమలు చేసే యోచనలో ఉండడంతో ముందస్తుగా ఈ ఆప్షన్​ పెడుతున్నామన్నారు. కాలేజీల అఫిలియేషన్​ గడువును ఏఐసీటీఈ ఈ నెల 29 వరకు ఇవ్వడంతో, జేఎన్టీయూ కూడా ఈ నెల 20 వరకు గడువు పెంచిందన్నారు. ఇప్పటిదాకా 15 కాలేజీలు మూసేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు.

ఇదీ షెడ్యూల్​..

ఫిబ్రవరి 19– ఎంసెట్​ నోటిఫికేషన్​
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30– ఆన్​లైన్​ దరఖాస్తులు
ఏప్రిల్​ 6– రూ.500 లేట్​

ఫీజుతో అవకాశం

ఏప్రిల్​ 13– రూ.వెయ్యి లేట్​ ఫీజుతో అవకాశం

ఏప్రిల్​ 20– రూ.5 వేల ఫీజుతో దరఖాస్తు

ఏప్రిల్​ 27– రూ.10 వేల ఫైన్​తో దరఖాస్తుకు అవకాశం

మార్చి 31 నుంచి ఏప్రిల్​ 3– దరఖాస్తుల్లో తప్పుల సవరణ

ఏప్రిల్​ 20 నుంచి మే 1– హాల్​టికెట్ల డౌన్​లోడ్​

మే 4,5,7– ఎంసెట్​ ఇంజనీరింగ్​ ఎగ్జామ్​​

మే 9,11– అగ్రికల్చర్​, మెడిసిన్​ విభాగాలకు పరీక్ష

పరీక్ష టైం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు.

మే 2న ఈసెట్

తొలిసారి రెండు  విడతలుగా పరీక్ష
20న నోటిఫికేషన్​..    24 నుంచి అప్లికేషన్స్​
ఈసెట్​ 2020 షెడ్యూల్ ​​విడుదల

హైదరాబాద్​, వెలుగు: డిప్లొమా, డిగ్రీ స్టూడెంట్లకు ఇంజనీరింగ్​, బీఫార్మసీ సెకండియర్​ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈసెట్​, మే 2న జరగనుంది. తొలిసారిగా రెండు విడతల్లో ఈసెట్​ను నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్​ ఈ నెల 20న విడుదల కానుంది. శనివారం ఉన్నతవిద్యా మండలి చైర్మన్​ పాపిరెడ్డి ఈసెట్​2020 షెడ్యూల్​ను విడుదల చేశారు. అంతకముందు సెట్​ కన్వీనర్​ మంజూర్​ హుస్సేన్​, సెట్​ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకూ ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.400, ఇతర స్టూడెంట్లకు రూ.800గా ఫీజును ఖరారు చేశారు.  విద్యార్థులకు రూ.400, ఇతర విద్యార్థులకు రూ.800 ఫీజును నిర్ణయించారు. పరీక్షను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెట్టనున్నారు. ఉదయం ఈసీఈ, ఈఐఈ, సీఎస్​ఈ, ఈఈఈ కోర్సుల వారికి, మధ్యాహ్నం సివిల్​, కెమిస్ట్రీ, మెకానికల్​, మైనింగ్​, మెట్​, ఫార్మసీ, బీఎస్​ఎం కోర్సుల వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి ఫార్మసీ, కెమికల్​ కోర్సులు చేసిన వారికీ బయోటెక్నాలజీ అడ్మిషన్లకు అవకాశమివ్వనున్నారు. ఇప్పటిదాకా కేవలం డిప్లొమా బయోటెక్నాలజీ వారికే అవకాశమిస్తూ వచ్చారు. కానీ, సీట్లు ఎక్కువగా మిగిలిపోతుండడంతో, ఫార్మసీ, కెమికల్​ ఇంజనీరింగ్​ వాళ్లకూ అవకాశమిచ్చేందుకు నిర్ణయించారు. 18 రీజనల్​ సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ ఈసెట్​​ షెడ్యూల్​

ఫిబ్రవరి 20– నోటిఫికేషన్​

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 28– ఆన్​లైన్​

దరఖాస్తులు

ఏప్రిల్​ 8– రూ.500 లేట్​ ఫీజుతో అవకాశం

ఏప్రిల్​ 18– రూ.వెయ్యి లేట్​ ఫీజుతో చాన్స్​

ఏప్రిల్​ 24– రూ.5 వేల ఫీజుతో

అప్లై చేసుకోవచ్చు

ఏప్రిల్​ 28– రూ.10 వేల ఫైన్​తో దరఖాస్తుకు చాన్స్​

మరిన్ని వార్తల కోసం