‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన వెంకట్ నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై ఆసక్తిని పెంచింది. శుక్రవారం ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటను కంపోజ్ చేశాడు.
‘ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ.. ఎప్పుడో సాయం రానే రాదే.. కనులలో దాగే కలలే చూపే.. ఎటు పోయిందో కన్నీరై.. ఓసారి ఒక వైపు.. ఓసారి ఇటు వైపు.. నాదారి ఎటువైపు..’ అంటూ కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్, సునీత పాడిన విధానం మనసుకు హత్తుకునేలా సాగింది.
‘‘నాదారే తప్పే.. మూసింది తలుపు.. మూగది నా పిలుపు.. నా గుండెలో సలుపు.. వినబడదా చెప్పు.. నా కథ నాకే కొత్తగా ఉందే.. మొత్తని గాయం మాననే లేదే..’’ అంటూ హీరోయిన్ శ్రీదేవి ప్రియుడ్ని తలుచుకుంటూ ఎమోషనల్‌గా సాగిన ఈ పాట ఆకట్టుకుంది. మార్చి 26న సినిమా రిలీజ్ కానుంది.
