15వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు వస్తలే

15వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు వస్తలే
  • ఈసీ మీటింగ్​లో టీఎన్జీవో నేతలు

హైదరాబాద్, వెలుగు: చాలా జిల్లాల్లో 15వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు రావట్లేదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగులు ఏ హాస్పిటల్​కు పోయినా ఈహెచ్​ఎస్ చెల్లట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాంపల్లిలోని యూనియన్ ఆఫీస్​లో టీఎన్జీవో కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మీటింగ్​కు హాజరయ్యారు.

ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ సాంక్షన్ కాలేదని, ఉద్యోగుల విభజన, మ్యూచువల్.. స్పౌజ్ బదిలీలు జరగలేదని, అప్పీళ్లు పరిష్కారం కాలేదని తదతరి 13 సమస్యలపై తీర్మానాలు చేశారు.  ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చినా అధికారులు అమలు చేయట్లేదన్నారు. అంతకు ముందు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామినాథం మృతికి మామిళ్ల రాజేందర్, బీజేపీ నేత స్వామిగౌడ్ సంతాపం తెలిపారు.