డీఏ విడుదలపై పెన్షనర్ల హర్షం.. పీఆర్సీ కూడా అమలు చేయాలని విఙ్ఞప్తి

డీఏ విడుదలపై  పెన్షనర్ల హర్షం.. పీఆర్సీ కూడా అమలు చేయాలని విఙ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం డీఏ విడుదల చేయడంపై స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం నల్లకుంటలోని అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు రాజేంద్ర బాబు, కార్యదర్శి ఎంవీ.నర్సింగ్ రావు మాట్లాడారు. ఇదే తరహాలో పీఆర్సీ అమలు చేయాలని, అన్ని హాస్పిటళ్లలో క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2024 మార్చి తర్వాత రిటైర్డ్​ అయిన ఉద్యోగులు, టీచర్లకు పెన్షన్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వి.రామ మనోహర్, బి.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.