ఇండియాతో జరిగే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌కు క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌కు పిలుపు

ఇండియాతో జరిగే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌కు క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌కు పిలుపు

లండన్‌‌‌‌‌‌‌‌: ఇండియాతో జరిగే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ జట్టును గురువారం ప్రకటించారు. మొత్తం 14 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారు. 2018లో జరిగిన సిరీస్‌‌‌‌‌‌‌‌లో కీలక పాత్ర పోషించిన పేసర్‌‌‌‌‌‌‌‌ క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అప్పట్లో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో వోక్స్‌‌‌‌‌‌‌‌ 137 రన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 159 రన్స్‌‌‌‌‌‌‌‌తో గెలిచింది. ఇప్పటివరకు కెరీర్‌‌‌‌‌‌‌‌లో 57 టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఆడిన వోక్స్‌‌‌‌‌‌‌‌ 181 వికెట్లతో పాటు 1970 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. వోక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు జోష్‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌కు కూడా జట్టులో చోటు కల్పించారు. 2022లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌పై చివరి టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆడిన జెమీ ఓవర్టన్‌‌‌‌‌‌‌‌కు అనూహ్యంగా పిలుపు అందింది.

గత వారం వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి వన్డేలో ఓవర్టన్‌‌‌‌‌‌‌‌ చిటికెన వేలికి గాయమైంది.  హ్యామ్‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీతో బాధపడుతున్న గస్‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరం కావడంతో ఓవర్ట్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీకి ఆడిన జాకబ్‌‌‌‌‌‌‌‌ బీథెల్‌‌‌‌‌‌‌‌తో పాటు జింబాబ్వేపై అరంగేట్రం చేసిన సీమర్‌‌‌‌‌‌‌‌ సామ్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. బీథెల్‌‌‌‌‌‌‌‌ రాకతో టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ డైలమా మొదలైంది. ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా షోయబ్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌కు అవకాశం దక్కింది.  

జట్టు: బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), షోయబ్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌, జాకబ్‌‌‌‌‌‌‌‌ బీథెల్‌‌‌‌‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌, బ్రైడన్‌‌‌‌‌‌‌‌ కార్సీ, సామ్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌, జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ, బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌, జెమీ ఓవర్టన్‌‌‌‌‌‌‌‌, ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌, జో రూట్‌‌‌‌‌‌‌‌, జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌, క్రిస్‌‌‌‌‌‌‌‌ వోక్స్‌‌‌‌‌‌‌‌.