
కొలంబో: విమెన్స్ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో మ్యాచ్ వాన ఖాతాలోకి వెళ్లింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వర్షం వల్ల 31 ఓవర్లకు కుదించిన ఈ పోరులో టాస్ ఓడిన ఇంగ్లండ్ 133/9 స్కోరు చేసింది. చార్లీ డీన్ (33) టాప్ స్కోరర్. హీథర్ నైట్ (18), ఎమ్ అర్లాట్ (18)తో సహా మిగతా వారు ఫెయిలయ్యారు.
ఫాతిమా సనా 4, సాదియా ఇక్బాల్ 2 వికెట్లు తీశారు. తర్వాత డక్ వర్త్ ప్రకారం పాక్ టార్గెట్‌ను 113 రన్స్‌గా నిర్దేశించారు. పాక్ 6.4 ఓవర్లలో 34/0 స్కోరుతో ఉన్న దశలో మొదలైన వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన పాక్ ఈ మ్యాచ్ తర్వాత సెమీస్ రేస్‌కు దాదాపు దూరమైంది.