
వన్డేల్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఘోరంగా ఆడుతోంది. టెస్ట్, టీ20 ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్న 50 ఓవర్ల ఫార్మాట్ అంటే వెనకపడిపోతుంది. రెండేళ్ల నుంచి పేలవ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ కంటే వెనక పడిపోవడం షాకింగ్ గా మారుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏడో స్థానంలో ఉంటే ఇంగ్లాండ్ 8 వ స్థానానికి పడిపోయింది. ఇటీవలే సౌతాఫ్రికాతో సొంతగడ్డపై తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఇంగ్లాండ్ 2027 వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది.
షెడ్యూల్ ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా, జింబాబ్వ్ ఆతిధ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు ఆడబోతున్నాయి. మొత్తం రూల్స్ ప్రకారం ఆతిధ్య దేశాలు సౌతాఫ్రికా, జింబాబ్వే వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధిస్తారు. నమీబియా కూడా ఆతిధ్యమిచ్చిన ఇది ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో ఆ జట్టుకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. ఆతిధ్యమిచ్చే రెండు దేశాలతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-8 లో జట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే మొత్తం 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్ల కోసం క్వాలిఫయర్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.
సౌతాఫ్రికా, జింబాబ్వే కాకుండా ప్రస్తుత ర్యాంకింగ్స్‌తో ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ వెస్టిండీస్ టాప్- 8లో ఉన్నాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్ కంటే ఇంగ్లాండ్ ముందు ఉంది. అయితే ఈ మూడు జట్ల మధ్య ర్యాంకింగ్స్ పెద్ద తేడా ఏం లేదు. ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరుసగా 8,9,10 స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్ బాగా ఆడి.. అదే సమయంలో ఇంగ్లాండ్ విఫలమైతే మాత్రం 10 స్థానానికి పడిపోతుంది. అప్పుడు వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతుంది. ఇప్పటి నుంచి ఇంగ్లాండ్ వరుసగా విజయాలు సాధిస్తేనే క్వాలిఫయర్ ఆడకుండా వరల్డ్ కప్ కి అర్హత సాధిస్తుంది.
మార్చి 31, 2027న సమయానికి టాప్ ఎనిమిది జట్లను వన్డే వరల్డ్ కప్ 2027కు అర్హత సాధిస్తాయి. 2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్-ఏ లో ఏడు జట్లతో పాటు గ్రూప్-బి మరో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూప్స్ లో టాప్- 3 లో నిలిచిన సూపర్-6 కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్- 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.