క్లినిక్స్, నర్సింగ్ హోం లకు అనుమతివ్వండి

క్లినిక్స్, నర్సింగ్ హోం లకు అనుమతివ్వండి
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ లెటర్

న్యూఢిల్లీ : లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ మెడికల్, పారా మెడికల్ స్టాఫ్, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్స్ మూమెంట్స్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది. ఇంటర్ స్టేట్ ట్రావెల్సింగ్ కు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోని అనుమతించాలని లెటర్ లో కోరింది.అన్ని రాష్ట్రాల్లో క్లినిక్ లు, నర్సింగ్ హోమ్ లను తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఓపీ సహా ఇతర ఆరోగ్య సేవలు బంద్ ఉండటం తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్ ఎప్పటి మాదిరిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మైగ్రెంట్ లేబర్స్ ను బస్సులు, శ్రామిక్ రైళ్లలో వారి స్వస్థలాలకు పంపించాలని కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదివారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా రాష్ట్రాలు మైగ్రెంట్ లేబర్స్ తిరిగి రావటం కారణంగా కేసులు సంఖ్య పెరుగుతుందని తెలిపాయి. గ్రీన్ జోన్లలో ఉన్న చాలా ప్రాంతాలు మళ్లీ రెడ్ జోన్లు గా మారుతున్నాయని…వలస కూలీల రాకను నియంత్రించాలని కోరాయి. అయినప్పటికీ కేంద్రం మాత్రం మైగ్రెంట్ లేబర్స్ ను తిరిగి వాళ్ల స్వస్థలాలకు పంపించాలంటూ రాష్ట్రాలకు లెటర్ రాసింది.