
ఓయూ, వెలుగు: అక్షరాభ్యాసం ఎక్కడ జరిగిందన్న దాన్నిబట్టి పిల్లల భవిష్యత్తు ఉండదని, వారి చుట్టూ ఉండే వాతావరణం, సమాజ నిర్మాణం, టీచర్లపై ఆధారపడి ఉంటుందని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. సిటీకి చెందిన రఘు, మధుమిత దంపతులు తమ కుమార్తె ప్రాణహిత అక్షరాభ్యాసాన్ని ఆదివారం ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ చేతుల మీదుగా చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్, పూలే, కారల్ మార్క్స్ లాంటి మహనీయుల అక్షరాభ్యాసాలు గుడిలో జరగలేదని, బడిలోనే జరిగాయన్నారు. రఘు దంపతులు తమ బిడ్డకు ప్రాణహిత అనే పేరు పెట్టడం అభినందనీయమని, పేరులో భావజాలం, భాష, వ్యక్తీకరణ ఉంటాయన్నారు.