
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్‌కాలేజీ పూర్వ విద్యార్థి, ఎన్ఆర్ఐ డాక్టర్అనిరెడ్డి దివేశ్రెడ్డి గాంధీ హాస్పిటల్‌కు రూ.50లక్షల మెడికల్ఎక్విప్మెంట్ ను విరాళంగా అందజేశారు. దివేశ్రెడ్డి ప్రస్తుతం అమెరికాలో గ్యాస్ర్టో ఎంట్రాలజిస్టుగా పనిచేస్తున్నారు. గాంధీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తనవంతుగా మంగళవారం వైద్య పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్గ్యాస్ర్టో ఎంట్రాలజీ హెచ్ఓడీ శ్రావణ్‌కుమార్, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.