
షాద్ నగర్, వెలుగు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగానే ఆయనను అరెస్టు చేయించారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంగెం, అల్వాల గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్‌తో కలిసి రూ. 22 కోట్లతో బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల పనులను ప్రారంభించి మాట్లాడారు.
మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించిన నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరేనని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే అంజయ్య, ఎంపీపీ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.