నీట్ ఫలితాల్లో ‘ఎస్సార్’ ప్రభంజనం..మెడిసిన్‌‌‌‌‌‌‌‌ లో 275 మందికిపైగా సీట్లు సాధించే చాన్స్

నీట్ ఫలితాల్లో ‘ఎస్సార్’ ప్రభంజనం..మెడిసిన్‌‌‌‌‌‌‌‌ లో 275 మందికిపైగా సీట్లు సాధించే చాన్స్

కాశీబుగ్గ, వెలుగు: నీట్ 2026 జాతీయ స్థాయి ఫలితాలు, ర్యాంకులలో ఎస్సార్​ విద్యా సంస్థల స్టూడెంట్స్ అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించినట్లు ఆ సంస్థ చైర్మన్​ వరదారెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని ఎస్సార్​ విద్యా సంస్థలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్​లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఎస్సార్​ విద్యా సంస్థలకు చెందిన స్టూడెంట్స్​ జాతీయ స్థాయిలో టాప్ మార్కులతో పాటు జనరల్​ కేటగిరిలో ఉత్తమ ర్యాంకులు సాధించి, సంస్థ కీర్తి ప్రతిష్టలను నేషనల్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో నిలబెట్టారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సార్​ విద్యా సంస్థల నుంచి 275 మందికి పైగా మెడిసిన్ సీట్లు సాధించే చాన్స్​ఉందని ఆయన వివరించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్​ డైరెక్టర్​ సంతోష్​రెడ్డితో పాటు టీచర్స్​, స్టూడెంట్స్​ తదితరులు పాల్గొన్నారు.