కరోనా చికిత్స కోసం స్పెషల్ హాస్పిటల్

కరోనా చికిత్స కోసం స్పెషల్ హాస్పిటల్

కోరానా చికిత్స కోసం ప్రత్యేక హస్పిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.  శాఖ పరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ్మిది  డిపార్ట్మెంట్ ల సమన్వయంతో పనిచేస్తామన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక నోడల్ ఆఫీసర్ నియమిస్తామన్నారు. ఊపిరితత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామన్నారు.  ప్రైవేట్ హాస్పిటల్స్ ను కూడా అప్రమత్తం చేస్తున్నామన్నారు. కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు. డబ్బులు చూడకుండా కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం గారు ఆదేశించారన్నారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని క్లీన్ వార్డ్ నిర్మాణం చేస్తామన్నారు.